కన్ను తెరిస్తే జననం...
మూస్తే మరణం అన్నాడో మహాకవి. మహానగరంలో రోడ్డెక్కితే కైలాసయాత్రే అనాల్సి
వస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్‌ను చూస్తే ఒళ్లు జలదరిస్తోంది. ప్రముఖులు
వచ్చినప్పుడు, వర్షం కురిసినప్పుడువాహనదారులకు నరకం కనిపిస్తోంది. ఐదారేళ్ల
క్రితం నగరంలో వాహనాల సరాసరి వేగం 20 కి.మీ. ప్రస్తుతం అది 15 కి.మీ.కి
పడిపోయింది. వేగానికి రద్దీతో కళ్లె పడుతున్నా... రోడ్డు ప్రమాదాలకు మాత్రం
అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషరేట్ పరిధిలో
రహదారులు మృత్యుమార్గాలకు చిరునామాగా మారుతున్నాయి. రోడ్డుప్రమాదాల బారిన
పడుతున్న వారిలో అధికశాతం పాదచారులే కావటం గమనార్హం.
No comments:
Post a Comment