జమ్మూకశ్మీర్‌లో
జాతీయ గీతం పాడే స్వేచ్ఛకూడా లేకుండా పోయింది. దోడా జిల్లాలోని ఒక పాఠశాలలో
జాతీయ గీతం పాడినందుకు విద్యార్థులపై ఉపాధ్యాయులు చేయిచేసుకున్నారు. ఇకపై
వందేమాతరం, జణగణమణ పాడితే బడి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
హాద్వా
ప్రాంతంలోని హైయర్ సెకండరీ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. రెండేళ్లుగా
పాఠశాలలో జాతీయ గీతం పాడే అవకాశం ఇవ్వడం లేదు. ఈ సారి ధైర్యం కూడగట్టుకుని
ఆగస్టు 15 విద్యార్థులంతా జాతీయగీతం ఆలపించారు. వారిని మధ్యలోనే అడ్డుకున్న
కొందరు ఉపాధ్యాయులు దౌర్జన్యం కూడా చేశారు.
No comments:
Post a Comment