అసోంలో వరద ఉధృతి అంతకంతకూ
పెరుగుతోంది. దాదాపు 13 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నదుల్లో
నీటిమట్టం ప్రమాదకరస్థాయిలో ఉండటంతో పరివాహక ప్రాంతాల వారు భయభ్రాంతులకు
గురవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
కొనసాగిస్తున్నారు. చిరాన్, కొక్రఝార్లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ
వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో చాలాచోట్ల జనం
ఆరుబయటే కాలం గడుపుతున్నారు. భారీ వర్షాలకు చిరాన్‌లో వందలాది ఇళ్లు,
వంతెనలు కూలిపోయాయి.
No comments:
Post a Comment