ad

Wednesday, September 9, 2015

డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల

ప్రభుత్వ, ప్రైవేటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డి.ఈల్‌.ఇ.డి)కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను మంగళవారం విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌.పి.సిసోడియా విడుదలచేశారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. ఆగస్టు 23న జరిగిన పరీక్షకు 1,11,327 మంది అభ్యర్థు లు హాజరయ్యారని వారి మార్కుల వివరాలను జ్ట్టిఞ://ఛ్ఛ్ఛీఛ్ఛ్ట్చిఞ. ఛిజజ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అకఅఖఅగఅఖీఏఐ టైపుచేయాలనిసూచించారు. వ్యక్తిగత వివరాల్లో (కులము, పుట్టిన తేది) ఏవైనా తప్పులుంటే 9 నుంచి 11లోపు వెబ్‌సైట్‌ లోని కంప్లెయింట్‌ బాక్స్‌లో నమోదు చేయాలని తెలిపారు

Saturday, September 5, 2015

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఇస్కాన్ ఆలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణపరమాత్ముని పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. మధుర, బృందావనం నుంచి మారుమూల గ్రామాల వరకు జన్మాష్టమి సందడి కనిపిస్తోంది. నేతల నుంచి సామాన్యుల వరకు ఆలయాల వద్ద బారులు తీరారు.

Thursday, September 3, 2015

ప్రభుత్వ ఆస్పత్రిలో 61 మంది చిన్నారులు మృతి

ఒడిశా రాష్ట్రం కటక్ లోని చిన్నపిల్లల ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.కేవలం రెండు వారాల్లో 61 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో పనిచేసే ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.మరో ముగ్గురు సిబ్బంది పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాక  మంత్రి అతను ఎన్ నాయక్ చెప్పారు.వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని,కేవలం సదుపాయాలు సరిగా లేకపోవడం వల్లనే చిన్నారులు మృతి చెందుతున్నారని  ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇంతమంది చిన్నారులు మృతి చెందుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్పత్రికి రాలేదని భాజపా ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శించారు.

సికింద్రాబాద్ లో ఆర్టీసీ బస్సు దగ్ధం,ప్రయాణికులు సురక్షితం

ప్రయాణికులతో జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్ వస్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు దగ్ధమైంది.ఇంజిన్ నుంచి పెగలు రావడాన్ని గమనించిన డ్త్రెవర్ అప్రమత్తమై సికింద్రాబాద్ పరేడ్ మైదానం సమీపంలో ప్రధాన రహదారిపై బస్సును నిలిపివేశాడు.వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దిగారు.ప్రయాణికులు బస్సులోంచి కిందికి దిగిన కొద్ది క్షణాల్లోనే ఇంజిన్ నుంచి భారీగా మంటలు చెలరేగాయి.స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

మాస్కో ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం

రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పలు విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిప్రమాదం వల్ల దాదాపు 60 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

తెలుగు రాష్ర్టాల్లో చెదురు మదురుగా వర్షాలు

ఛత్తీస్‌గడ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.

Wednesday, September 2, 2015

కార్మికులకు సామాజిక భద్రత: అచ్చెన్నాయుడు

ఒప్పంద కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయు డు తెలిపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఒప్పంద కార్మికులే కాకుం డా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షే మం కోసం ఆయా పరిశ్రమలకు వర్తింపచేసేలా చట్టాలు రూపొందించినట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది మే-డే నుంచి అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.